విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళకు బదిలీ అయింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, జిల్లా స్కూల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా నియమించారు. విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎన్. ప్రేమ్ కుమార్ ను నియమితులయ్యారు. శుక్ర, శనివారాల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.