విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం నిర్వహించిన వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలకు దగ్గరగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వెంకట్రావు అధ్యక్షత వహించారు.