ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో బాగంగా.. తురకలపూడి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం నందు వైద్యాధికారి డాక్టర్ కె. నీరజ గర్బవతులకు అవసరమయిన పరీక్షలు నిర్వహించారు. ప్రమాదకర గర్భిణిలను గుర్తించి వారికి చికిత్స చేయటం జరిగింది. పోషన్ అభియాన్ కార్యక్రమంలో బాగంగా గర్భవతులందరికీ పౌష్టికాహారం ఆవశ్యకత మరియు గర్బకాలములో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రాధమిక ఆరోగ్యకేంద్రం ఎ.ఎన్.ఎంలు, ఆశా కార్యకర్తలు, మరియు అంగన్ వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.