అరకులోయ మండలంలోని చలి పంజా విసురుతోంది. పది రోజులుగా ఉదయం 9. 30 గంటలైన భానుడు బయటకు రావడం లేదు. దీంతో ప్రజలు చలికి వణుకుతూ ఉదయం సాయంత్రం ఇళ్లకే పరిమితమతున్నారు. కొందరు చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఆదివారం ఉదయం కురిసిన విపరీతమైన పొగ మంచు కారణంగా అరకులోయ మండలంలో ఉన్న అంజోడాఫార్క్ తదితర సందర్శన ప్రాంతాలకు వెళ్లే పర్యాటక వాహనాలు ఇబ్బంది పడుతూ హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగించారు.