పాయకరావుపేట: పట్టణంలో
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసిసి ఉప నేత రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలు జగతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి , కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఅసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు మోర్త సింహాచలం, కోటఉరట్ల మండల అధ్యక్షలు నడింపల్లి. నూకరాజు, నక్కపల్లి మండల అధ్యక్షులు ప్రగడ చక్రారావు, బర్రె జగన్నాధం, టేకు సాయి, జనక, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.