తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట మండల అధ్యక్షులు, తుని నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పెదిరెడ్డి చిట్టిబాబు పుట్టినరోజు వేడుకలు ఆదివారం పాయకరావుపేటలో ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మి ధియేటర్ వద్ద జరిగిన ఈ జన్మదిన వేడుకలకు తుని, పాయకరావుపేట నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విచ్చేసి చిట్టిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాలతో సత్కరించారు.