మండలంలోని మంగవరం పంచాయతీ పరిధిలోని ఆదివారం జనంతో" జనం కోసం జనసేన" కార్యక్రమం నిర్వహించారు.
ఈ మేరకు జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాసమస్యలపై జనసేన పార్టీ ఎప్పుడు పోరాడుతుందని ప్రజలకు తెలియజేశారు. ఒక సారి జనసేన పార్టీ కి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో దొడ్డిపట్ల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ మామిడి శ్రీను, పేపకాయల లింగాలు, బోడపాటి రాజు, దేశంశెట్టి చిన్న, కట్టా నరసయ్య, గాబు శివ, పడాల శివ, పడాల శుభాష్, గట్టెం మల్లి, ఆరుగుల రమేష్ , పాల్గొన్నారు.