కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం పట్ల హర్షం

1835பார்த்தது
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం పట్ల హర్షం
కర్ణాటక రాష్ట్రంలో 224 అసెంబ్లీ స్థానాలకు కాను అత్యధిక అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల పిసిసి డెలిగెట్ జగతా శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేశారు. జగతా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం బిజెపి పతనానికి నాంది పలుకుతుందని తెలిపారు. ఏఐసీసీ ఉపనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ప్రజల స్వాగతించారని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలో ఉంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி