కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, అధికారంలోకి రావడంతో పాయకరావుపేట నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల
ఫలితాలు శనివారం వెలువడ్డాయి. రాష్ట్ర అసెంబ్లీలో 224 నియోజకవర్గాలు ఉండగా
కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 136 స్థానాల్లో ఘన విజయం సాధించి ఏ ఇతర పార్టీలతోనూ పొత్తు అవసరం లేకుండా ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల విజయాన్ని సొంతం చేసుకుంది.
దీంతో పాయకరావుపేట నియోజకవర్గంలోని, నక్కపల్లి మండలం, దేవవరం గ్రామంలో
కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవాన్ని జరుపుకున్నారు. ఎపిసిసి అనకాపల్లి జిల్లా కార్యదర్శి బూర్తి యేసు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జై
కాంగ్రెస్, జై జై
కాంగ్రెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.