కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో దసరా ఉత్సవాలు ముగించుకుని, గ్రామాల్లో అమ్మవారి ఊరేగింపు వైభవంగా సాగింది. లక్ష్మీదేవి పేటలో దుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసి న కనకదుర్గమ్మ అమ్మవారిని సోమవారం ప్రత్యేక వాహనంపై పురవీధుల్లో డిజే సాంగ్స్ , కోలాటం, డప్పు వాయిద్యాలు, బాణసంచా నడుమ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భావాని లు, యువత దుర్గ్గమ్మ ని ఊరేగించి లక్ష్మీదేవిపేట ఊరచెరువులో నిమజ్జనం చేశారు.