లోకేష్ బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దేవేందర్ రెడ్డీ పై కేసు నమోదు చేయండి

1554பார்த்தது
లోకేష్ బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దేవేందర్ రెడ్డీ పై కేసు నమోదు చేయండి
హుకుంపేట మండలం పోలీస్ స్టేషన్ లో తెలుగదేశం పార్టీ నాయుకులు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దేవేందర్ రెడ్డీ పై కేసు నమోదు చేయాలని పిర్యాదు చేశారు. ఈ సందర్భంలో మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దేవేందర్ రెడ్డీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పై అనుచిత వ్యాఖ్యలు ట్విట్టర్ వేదికగా చేశారు. ఐతే ఇటీవల స్వర్గస్తులైన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కంటమనేని ఉమా మహేశ్వరి చావుకి లోకేష్ కారణమంటూ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దేవేందర్ రెడ్డీ వ్యాఖ్యలు చైయదన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేక పెరుగుతుంది అని లోకేష్ కు వస్తున్నా ప్రజాదరణ చూసి ఓర్వలేక వైఎస్సార్సీపీ అధిష్టానమే టీడీపీ నాయకులు పై బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది అని శవ రాజకీయాలు మానుకోవాలని దేవేందర్ రెడ్డీ పై కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி