మాడుగుల: పాము కాటుతో మహిళ మృతి
జి.మాడుగుల మండలం లువ్వాసింగి గ్రామానికి చెందిన ఊలంగి సరస్వతి (40) శనివారం ఉదయం పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను జి.మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు, కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. సకాలంలో వైద్యం అందివుంటే ప్రాణాలతో ఉండేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.