సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని నేవీ అధికారులు సిబ్బందిని హెచ్చరించారు. విశాఖ తూర్పు నౌకాదళం పరిధిలో గల నేవెల్ సిబ్బంది, నేవెల్ స్కూల్స్లో విద్యార్థులకు సైబర్ భద్రతపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించినట్టు నేవీ అధికారులు తెలిపారు. జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం 2024 సందర్భంగా ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.