మెంటాడ మండలం జయతి గ్రామంలో బుధవారం గౌరీ పౌర్ణమి సందర్భంగా గౌరి పరమేశ్వరునితో కూడిన, నందెన్న విగ్రహాలను గౌరి నోములు, నోచేందుకు గ్రామంలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ ఊరేగింపులో నందీశ్వరులను శిరస్సున పెట్టుకొని కొంత దూరం తీసుకువెళ్లిన మహిళలకు, పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు అవుతాయని, పిల్లలు పుట్టని వారికి పిల్లలు పుడతారని అత్యంత విశ్వాసంతో మహిళను ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటారు. అనంతరం నందీశ్వరులను ప్రతిష్టించి తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లెల్లో ఆచారం ప్రకారం గౌరీ పరమేశ్వరుల పాటలు పాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.