రాజాం మండల కేంద్రంలో స్థానిక ఆదర్శనగర్ లోని సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడు గురువారం సందర్శించారు. ముందుగా సచివాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.