విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పి ఎస్. వి. మాధవరెడ్డి కోరారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం పార్వతీపురం పట్టణ పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పి ఎస్. వి. మాధవ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పట్టణంలోని వివిధ పాఠశాలల, కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.