రైతుల నుంచి సేకరిస్తున్న విశాఖ డెయిరీ పాలధరను ప్రభుత్వం తగ్గించడాన్ని నిరసిస్తూ శుక్రవారం పాడి రైతులు ఎపి రైతుసంఘం ఆధ్వర్యాన సీతానగరం మండలం కాశీపేట బల్క్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. కృష్ణమూర్తి మాట్లాడుతూ విశాఖ డెయిరీకి రైతులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పాలు పోస్తున్నారని అయినా రైతులకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన వ్యక్తం చేశారు.