తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల /కళాశాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పార్వతీపురం ఐ టీ డి ఏ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన దీక్షలు చేపట్టారు.