పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. గతంలో యూనియన్ నాయకులతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 9నెలలు కావస్తున్నా నేటికీ జీవో విడుదల కాకపోవడంతో ఆశ వర్కర్లు ఆందోళనకు గురవుతున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు.