విద్యార్థుల అభ్యసన, పురోగతి లక్ష్యాలకు అనారోగ్య సమస్యలు అవరోధం కాకూడదని మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. విజయ పార్వతి అన్నారు. పార్వతీపురం మండలంలోని తాళ్ళబురిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సందర్శించారు. ఉపాధ్యాయ, వైద్య సిబ్బందితో సమీక్షించి విద్యార్థుల ఆరోగ్యం, పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం, ప్రగతి నివేదికల వివరాలు రికార్డుల్లో పరిశీలించారు.