నెల్లిమర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురువారం అధికారులను ఆదేశించారు. రామతీర్థం పుణ్యక్షేత్రంలో కల్పించాల్సిన వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మ్యూజియం, రోప్ వే నిర్మాణం, రహదారుల విస్తరణ పనులు, పర్యాటకులకు కల్పించాల్సిన వసతులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు.