మన్యపురి సోములు 15వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరజాపుపేట గ్రామంలో నిర్వహించారు. రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిల వాసు మాట్లాడుతూ.. మన్యపురి సోములు జ్ఞాపకాలు చిరస్మరణంగా నిలిచిపోతాయి అని అన్నారు. పది సంవత్సరాలు సొసైటీ బ్యాంక్ అధ్యక్షులుగా సేవలందించారని ఆయన కొనియాడారు. జిల్లా మొత్తానికి కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి మన్యపురి సోములు క్లాత్ సెంటర్, కిరాణా సెంటర్ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి జరజాపుపేటకి పేరు తెచ్చేలా చేశారని ఆయన అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు స్కూలు పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. తన పెద్ద కుమారుడు సొసైటీ బ్యాంక్ మాజీ అధ్యక్షులు మన్యపురి మోహన్ రావు, తన చిన్న కుమారుడు మన్యపురి రాము నాయుడు, తన అల్లుడు మజ్జి సీతారాం చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పసుమర్తి శ్రీనివాసరావు, మద్దిల కృష్ణారావు, హరి భాస్కర రావు, నల్లి శివప్రసాద్ పాల్గొన్నారు.