పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు బకాయి వేతనాలు చెల్లించాలని సీఐటీయూ పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వ ర్యంలో గ్రీన్ అంబాసిడర్లు నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో కేశవనాయుడుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.