కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మ, రావాడ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో ఇద్దరు వైసిపీ కార్యకర్తలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న వైసిపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజ్ ఆ కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆదివారం వారి ఇంటికెళ్లి పరామర్శించారు. ఏ అవసరం ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పార్టీ పరంగా ఆదుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు.