కొమరాడ మండలం, విక్రంపురం గ్రామంలో శనివారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక ప్లాస్టిక్ సంచిలో 100 నాటు సారా ప్యాకెట్లుతో కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామానికి చెందిన మెల్లిక ఆదినారాయణ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరాకాలనీలో నాటు సారా వినియోగం, రవాణ వల్ల జరిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు.