ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. విజయపార్వతి సూచించారు. కొమరాడ మండలంలోని కెఆర్‌బి పురం, కొమరాడ పిహెచ్‌లను, ఎస్‌ఎం పురంలో ఎఫ్‌డిపి వైద్య శిబిరాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిహెచ్‌సిలో రికార్డులు తనిఖీ చేసి హాజరు నమోదు పరిశీలించారు. జ్వరాలు, సీజనల్ వ్యాధుల వివరాలపై ఆరా తీశారు.