డెంకాడ మండలం రఘుమండ జడ్పీ హైస్కూల్లో అండర్ 14, 17 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు సోమవారం ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ప్రావీణ్యత సాధించాలని తెలిపారు. క్రీడలు శారీరిక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తాయని తెలిపారు. ఎంపీపీ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.