గజపతినగరం మండలంలోని కెంగువ గ్రామంలో డయేరియా బాధితులను గజపతినగరం జడ్పిటిసి గార తౌడు మంగళవారం పరామర్శించారు. అలాగే గ్రామంలోని వీధులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కేసులు పెరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు. వైసిపి నాయకులు బెల్లాన త్రినాధరావు, ఎంపీడీవో కళ్యాణి, తహసిల్దార్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.