ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రజలు సహకరించాలని గంగచోళ్లపెంట ఎంపీటీసీ కనకల పైడన్న కోరారు. జిల్లా ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం విజయ నెట్ వర్క్ అఫ్ పాజిటివ్ పీపుల్ ద్వారా గ్రామంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్ రోగు లపట్ల వివక్షత చూపుతే చట్ట రీత్యా నేరమని అన్నారు. ఆరోగ్య సిబ్బంది ధనలక్ష్మి, సంతోషి పైడిరాజు చిట్టి లక్ష్మీ హేమలత తదితరులు పాల్గొన్నారు.