ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రజల సహకరించాలని గంగచోళ్లపెంట ఎంపీటీసీ కనకల పైడన్న కోరారు. ఈ కార్యక్రమం జిల్లా ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విజయ నెట్ వర్క్ అఫ్ పాజిటివ్ పీపుల్ ద్వారా గురువారం జరిగింది. ఎయిడ్స్ రోగులపట్ల వివక్షత చూపుతే చట్టరీత్యా చర్యలు తప్పవని హెల్త్ సూపర్వైజర్ ఎం పైడన్న హెచ్చరించారు. ఆరోగ్య సిబ్బంది ధనలక్ష్మి, సంతోషి పైడిరాజు చిట్టి లక్ష్మీ హేమలత తదితరులు పాల్గొన్నారు.