పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గురువారం రామభద్రపురం మండలం తారాపురం గ్రామంలో ఎమ్మెల్యే బేబీ నాయన అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని, రామభద్రపురం మండలానికి గాను రూ. 5, 13, 11, 000 మంజూరైనట్లు తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టం చేస్తుందన్నారు.