ఏపీలోని అన్ని యూనివర్సిటీలను ఒకే చట్ట పరిధిలోకి తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నిన్న ఏపీ ఉన్నత విద్యాశాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యారంగాన్ని తిరిగి పట్టాలెక్కించి.. మంచి ఫలితాలు సాధించే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పీపీపీ విధానంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా వీసీలను నియమించాలన్నారు.