AP: తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఇందులో తీర్మానించనున్నారు. సాయంత్రానికి చెక్కులు తయారు చేసి, రేపు ఉదయానికల్లా ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం మృతుల గ్రామాలకే వెళ్లి వాటిని అందజేసే అంశంపైనా చర్చించనున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.