పొలం దగ్గర వివాదంలో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన రాపూరు మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం అక్కమాంబపురం కి చెందిన సుబ్బయ్య 45ఏళ్ళ క్రితం ఎకర పొలం కొని దాని సాగు చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ పొలం మా బంధువులు మీకు అమ్మారు అంటూ ఘర్షణకు దిగి కత్తితో దాడి చేయబోతుండగా సుబ్బయ్య కూతురు ఆనంతమ్మ అడ్డు రావడంతో కత్తి ఆమె చేతి పై బలంగా తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆమెను రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.