తాహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

84பார்த்தது
తాహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
మండల తాహసిల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. బుధవారం బాలాయపల్లి మండల తాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి సదరు కార్యాలయంలో పలు విభాగాలను తనిఖీ చేశారు. రికార్డులను భద్రపరిచే గదిని పరిశీలించి వర్షాలకు రికార్డులు తడవకుండా మరమ్మత్తులు చేపట్టి రికార్డుల భద్రతకు చర్యలు చేపట్టాలని డీటీ శిరీషను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி