ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలో కొస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రకటించిన 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే వారికి ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రామానాయుడు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద రైతులతో ఆందోళన నిర్వహించారు.