తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సీలింగ్ ప్రమాదకరంగా ఉన్నట్లు సిబ్బంది వాపోతున్నారు. శిథిలస్థితిలో ఉన్న కార్యాలయంలో అధికారులు నానా ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. కొత్త భవనం ఏర్పాటు చేయాలన్న పాలకవర్గ నిర్ణయం ప్రతిపాదనలకే పరిమితమైంది. చిన్నపాటి వర్షాలకు సైతం పలు భవనాలు ఉరుస్తున్నాయిని సిబ్బంది వాపోతున్నారు.