సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం పట్టణంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు ఉదయమే స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ధూపా దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి ఊంజల్ సేవలు చేశారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై ఆలయ మాడ వీదుల్లో ఊరేగించారు.