సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి ఆనకట్ట వద్ద శుక్రవారం అరుణానది నీటి ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టు నుంచి గేట్లు ద్వారా వస్తున్న నీటితోపాటు నందనం వంక నుంచి వస్తున్న వరద నీటితో అరుణానదిలో భారీ ప్రవాహం వస్తోంది. ఆంధ్ర రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో పాటు తమిళనాడు ఇరిగేషన్ అధికారులు వరద నీటి పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.