నాగలాపురం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని అడవి చెల్లాతమ్మ ఆలయంలో మంగళవారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. పూజారి ఆలయంలో అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయం వద్ద పొంగళ్ళు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు.