సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో భారీ వర్షం కురుస్తుంది. ఫెంగల్ తుఫాన్ కారణంగా శుక్రవారం రాత్రి ప్రారంభమైన వర్షం శనివారం రోజు ఏకధాటిగా కురుస్తుందని స్థానికులు తెలిపారు. భారీ వర్షం కారణంగా పంట పొలాలు దెబ్బతిన్నట్లు రైతులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులు ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరారు.