సత్యవేడు శ్రీసిటీలో ఏసీ కంపెనీలకు మెటీరియల్ సప్లై చేసే త్రినాధ్ కంపెనీ వేస్టేజ్ స్టోర్ రూమ్లో శనివారం రాత్రి మంటలు చెలరేగినట్లు కార్మికులు తెలిపారు. దీంతో కార్మికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని శ్రీసిటీ సీఐ శ్రీనివాసులు తెలిపారు. మంటలను త్వరగా అదుపు చేయడానికి శ్రీసిటీ అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.