చిత్తూరు జిల్లా , పుంగనూరు పరిధిలో తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కరెంట్ వైర్లు, పరికరాల వద్ద జాగ్రత్తగా ఉండాలని విద్యుత్తు శాఖ డీఈఈ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. తమ సిబ్బంది అంతా అలర్ట్ ఉందని చెప్పారు. ఎక్కడైనా సమస్య ఎదురైతే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.