భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నేడు అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగిన జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ కు 9491077356, 08572-242777కు నగరపాలక కంట్రోల్ రూమ్ 98499 07885 కు సమాచారం ఇవ్వాలన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.