చిన్నపిల్లలపై అఘాయిత్యాలు అరికట్టడానికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించాలని నగిరి సీఐ మహేశ్వర్ రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కొత్తగా వచ్చిన తనకు ప్రజలు సహకరించాలని కోరారు అసాంఘిక కార్యకలాపాల అరికట్టడానికి సమాచారం స్వయంగా నాకు అందించాలన్నారు. గంజాయి విక్రయాలు చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, మహిళలపై జరిగే వేధింపుల సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.