మంత్రాలయం: గత ప్రభుత్వం అభివృద్ది పనులను విస్మరించింది
మంత్రాలయం నియోజకవర్గం లోని ప్రతి పల్లె కలకలలాడాలన్నదే తమ ద్యేయమని మంత్రాలయం టిడిపి ఇన్ ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. బుధవారం కోసిగి మండలం చిన్న బొంపల్లి, పెద్ద బొంపల్లి, ఐరంగల్ జంపాపురం గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం అభివృద్ది పనులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నియోజకవర్గంలో రాజకీయంలో వర్గ విభేదాలు లేకుండా పనిచేయాలని సూచించారు.