రాజకీయాలకు అతీతంగా పని చేయాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హితవు పలికారు. శనివారం పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీవిద్య అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులను అనుసంధానం చేసుకొని మంచిపని గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తేవాలన్నారు.