పురుగుమందుల పిచికారీలో డ్రోన్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. నగరాలకే పరిమితమైన ఈ టెక్నాలజీని క్రమంగా పల్లెల్లోనూ వాడుతున్నారు. పెద్దకడబూరు మండల కేంద్రంలో బుధవారం రైతు నవీన్ రెడ్డి డ్రోన్‌తో తన వరి పంటకు మందు పిచికారీని ప్రారంభించారు. కూలీల కొరతను అధిగమించేందుకు డ్రోన్ వైపు ఆసక్తి చూపిస్తున్నామని రైతులు తెలిపారు. ఇక దీన్ని ఎంతమంది అనుసరిస్తారో వేచి చూడాలన్నారు.