కుప్పం: మాదిగల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయండి

60பார்த்தது
కుప్పం: మాదిగల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయండి
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈనెల 14న జరిగే మాదిగల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ అన్నారు. రామకుప్పం మండలం గడ్డురు గ్రామంలో ఆదివారం మాదిగల సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ అలుపెరుగని పోరాటం చేసి వర్గీకరణ సాధించుకున్నారన్నారు. ఆత్మీయ సదస్సుకు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி