ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గూడూరు ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ కలిసి విజయవాడ వరద బాధితులకు సహాయార్ధం కోటి రూపాయల విరాళాన్ని సాగర్ గ్రంథి ఆక్వా ఎక్సపోర్ట్ కంపెనీ ప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యేను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేత బీద రవిచంద్ర మరియు ఆక్వా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.